IND Vs ENG : రాణించిన బౌలర్లు.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

-

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ-20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ-20 మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అర్ష్ దీప్ సింగ్ అద్భుతమైన బౌలింగ్ ఓపెనర్లను పెవీలియన్ కు చేర్చి రికార్డు  సృష్టించాడు. మరోవైపు ఒకే ఓవర్ లో వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీయడం విశేషం. 7.3 ఓవర్ కు హ్యారీ బ్రూక్ బౌల్డ్ అయ్యాడు. 7.5 ఓవర్ కు లియామ్ లివింగ్ స్టర్ ఖాతా తెరవకుండానే పెవిలీయన్ కు చేరాడు. బంతిని అంచనా వేయలేక లివింగ్ స్టన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

వరుసగా వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో ఉన్నప్పటికీ మరోవైపు కెప్టెన్ జాస్ బట్లర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నికలడగా ఆడిన బట్లర్ 68 పరుగులు చేసి అతను వరుణ్ ఛక్రవర్తి వేసిన 17వ ఓవర్ లో సిక్స్ బాదాడు. ఆ తరువాత బంతికి భారీ షాట్ ఆడగా.. నితీశ్ రెడ్డి మంచి డైవ్ తో అద్భుతమైన క్యాచ్ పట్టాడు. చివరి బంతికి మార్క్ వుడ్ ఔట్ కావడంతో 20 ఓవర్లకు ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 132 పరుగులు సాధించింది. భారత్ టార్గెట్ 133 పరుగులు. ఛేదిస్తుందో లేదో చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version