బ్రహ్మాజీ జీవితం గురించి – ఫామిలీ గురించి ఎవ్వరికీ తెలియని దారుణ నిజాలు !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మాజీ అదిరిపోయే క్యారెక్టర్లు చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పటినుండో అలరిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి మరియు ఇండస్ట్రీలో అనేక విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ఉన్న జీవితాన్ని ఉన్నట్టుగా బతికేయడం సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు నేర్చుకోవాలని తెలిపాడు.

అవకాశాలు ఉన్న సమయంలో ఒకలాగా లేని సమయంలో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవటం దారుణమైన విషయం అని బ్రహ్మాజీ షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరితో ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉండాలని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తనకు ఒక భార్య ఉందని మణికొండలో తన నివాసం అని అన్నారు.

 

సినిమాని తాను ఒక ఉద్యోగంలో ఫీల్ అవుతాను సినిమా షూటింగ్ అయిన వెంటనే సెట్ లో నుండి బయటకు వచ్చేసరికి సామాన్యుడు అయిపోతాను అంటూ తెలిపాడు. అంతేకాకుండా తాను ఇంటికి కూరగాయలు బయట మార్కెట్లో తీసుకుంటానని బయట సెలబ్రిటీలను జనం ఇబ్బంది పెడతారు అన్న వార్తల్లో వాస్తవం ఉండదని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని బ్రహ్మాజీ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version