కొడంగల్లో రూ.50 లక్షల భూమిని రూ.10 లక్షలిచ్చి లాక్కోవాలని చూస్తారా? : ఎంపీ ఈటల

-

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రూ. 50 లక్షల విలువైన భూమిని రూ. 10 లక్షలు ఇచ్చి లాక్కోవాలని చూస్తున్నారని.. సీఎం సోదరుడు అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయన్నారు. ఇక రేవంత్‌కి ఓటు వేసి కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు కొడంగల్ రైతుల పరిస్థితి ఉందన్నారు.

కాంగ్రెస్ వాళ్లే లగచర్ల ఘటనకు స్కెచ్ వేసుకుని మరీ ఈ దాడులు చేయించారని ఆరోపించారు. 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు.దీనిపై పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తాం. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు..కానీ, బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటి? నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతుకు సంకెళ్లు, థర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు.
ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు.రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఊరుకోమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version