కులగణన సర్వే పై విపక్షాల విమర్శలు అర్థరహితం అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వే శాస్త్రీయంగా జరుగుతోందని తెలిపారు. ఏ కుటుంబానికి ఏం అవసరం.. ఏ గ్రామానికి ఏం అవసరం సర్వే ద్వారా తెలుస్తోంది. సరైన మార్గంలోనే సర్వే జరుగుతుంది. మనిషి ఎక్స్ రే మాదిరిగా సర్వే జరుగుతుంది. ఇప్పటి వరకు 58 శాతం సర్వే పూర్తి అయింది. హైదరాబాద్ 37 శాతం పూర్తయింది. ఈనెల 30 వరకు సర్వే పూర్తవుతుందని తెలిపారు. కోటి 16 లక్షల 14వేల కుటుంబాలు ఉన్నట్టు అంచనా వేసినట్టు తెలిపారు మంత్రి పొంగులేటి.
ముఖ్యంగా కులగణన సర్వేను ఫార్మాట్ ప్రకారం కంప్యూటీకరణ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే.. దానికి సహకరించినందుకు ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు మంత్రి పొంగులేటి. అందరూ సర్వే చేయించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ సర్వే చేయించుకున్నారు. చేయించుకోని వారు కూడా చేయించుకోవాలని సూచించారు.