BREAKING: బిడ్డకి జన్మనిచ్చిన బాలీవుడ్ జంట

-

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్ దంపతులకు కూతురు జన్మించింది. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ జరిగింది. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆలియా భట్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కాగా.. వీరి వివాహం ఏప్రిల్ 14న ఘనంగా జరిగింది. వివాహం తర్వాత వీరిద్దరూ జంటగా “బ్రహ్మాస్త్ర” చిత్రంలో నటించారు.

కాగా ఆ మధ్య తాను తల్లి కాబోతున్న విషయాన్ని చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పైనుంచి ఆలియా ఫ్యాన్స్ కి తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక బ్రహ్మాస్త్ర చిత్రం ప్రమోషన్లలో కూడా ఆలియా తన భర్తతో కలిసి పాల్గొంది. ఈ ప్రమోషన్స్ లో బేబీ బంప్ తో తిరుగుతూ హల్చల్ చేసింది ఆలియా. అయితే తాజాగా నేడు ఉదయం ఆలియా భర్తతో కలిసి డెలివరీ కోసం రిలయన్స్ ఆసుపత్రికి వెళ్లింది. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో ఆమెకు డెలివరీ జరిగింది. పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో ఆలియా భట్ కి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version