కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరికి కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కెసిఆర్ డిసైడ్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు లో డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్.. బిఆర్ఎస్ కి ఎలా ప్రత్యామ్నాయం అవుతుందని ప్రశ్నించారు.
బిఆర్ఎస్ వీక్ గా ఉన్నచోట కాంగ్రెస్ ను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఇక రాబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్. పార్టీలో వివిధ రకాల నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్లు కేటాయిస్తామన్నారు. పార్టీలో క్రమశిక్షణతో ఉండాలని.. ప్రజల్లో ఉంటూ నిత్యం ఓటర్లను కలిసే వారికే గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రజల్లో ఉండే వారికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రావచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.