తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వినోదయ సీతం రీమేక్ గా తెలుగులో బ్రో చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే . సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను జూన్ 28వ తేదీన చాలా గ్రాండ్ గా 1600 స్క్రీన్ లలో విడుదల చేయడం జరిగింది. ఫాంటసీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రో మూవీ కంటెంట్ విషయంలో కొన్ని విమర్శలు వినిపించినా సరే పవన్ మ్యాజిక్ మాత్రం బాగా పనిచేసిందని చెప్పాలి.. ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపించాడు.. తన మేనరిజంతో మరొకసారి అభిమానులను ఖుషీ చేశాడు.
ఇక పవన్ మేనియా కారణంగానే మొదటిరోజు ఈ సినిమా రూ .30 కోట్ల వరకు వసూలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధిక వర్షాల కారణంగా మొదటి రోజు ఈ సినిమా రూ.22 కోట్ల మేర వసూలు రాబట్టే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినా కూడా భారీ అంచనాలను అధిగమిస్తూ ఏకంగా రూ..30 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. శుక్రవారం నైజాం ఏరియాలో రూ .14 కోట్ల వరకు వసూల్ వచ్చినట్లు సమాచారం.
గోదావరి జిల్లాలో రూ .5 కోట్లు, ఉత్తరాంధ్ర ,గుంటూరు జిల్లాలలో రూ.2.50కోట్లకు పైగా బ్రో మూవీ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్, మాస్, హీరోయిజం వంటి హంగులు లేని ఇలాంటి క్లాస్ మూవీకి ఈ రేంజ్ లో వసూల్ రావడం నిజంగా అరుదని చెప్పుకోవాలి. అయితే ఇదంతా పవన్ క్రేజ్ ఇమేజ్ వల్లే సాధ్యమైందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి.