కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి: మంత్రి హరీశ్‌ రావు

-

బీజేపీ, కాంగ్రెస్​లపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్ రావు మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి.. ములుగు మండల కేంద్రంలో పోలీస్‌ స్టేషన్‌, వర్గల్ మండలం గౌరారంలో సర్కిల్ పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ పనులకు మంత్రి మహమూద్ అలీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి చెప్పినట్లు వింటున్నారని, మరోవైపు చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వింటున్నారని విమర్శించారు. కిషన్‌ రెడ్డి గురువు కిరణ్‌ కుమార్‌ రెడ్డి అని, చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ రెడ్డి అని అన్నారు. వీరిద్దరి వల్ల తెలంగాణ బతుకులు ఆగమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక చట్టాలతో వేలాది రైతుల చావుకు బీజేపీ కారణమైందని.. మూడు గంటల కరెంటు చాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version