కరోనా బారిన పడ్డ ఆస్కార్ అవార్డ్ గ్రహీత .. ఇది వీడికి తగిన శిక్ష అంటున్న నెటిజన్స్ ..!

-

కొంతమంది సెలబ్రిటీ హోదాలో ఉండి ఎన్నో పాపాలను చేస్తారు. ఆ పాపాలే వాళ్ళకి జీవితంలో కోలుకోని విధంగా శిక్షలు విధిస్తాయి. గతంలో ఇలాంటి సంధర్భాలు ఎన్నో ఉదాహర్ణలుగా చూశాము. ఇప్పుడు కూడా ఒక పాపులర్ సెలబ్రిటీ కి ఇదే జరిగింది. హార్వే వీన్ స్టెయిన్.. ఇతని పేరు తెలియని సినీ అభిమానులు ఎవరూ ఉండరు. స్టార్ ప్రొడ్యూసర్ గా ప్రతిష్టాత్మక ‘ఆస్కార్’ అవార్డు సాధించిన వ్యక్తిగా అందరికీ పరిచయస్తుడు. అంతకన్నా ‘మీటూ’ ‘కాస్టింగ్ కౌచ్’ ఉద్యమాలకి బీజం వేసిన ఘనుడు. 2017లో దాదాపు 15 మంది హీరోయిన్లకు పైగా హార్వేపై చేసిన లైంగిక ఆరోపణల ద్వారా హార్వే అసలు బాగోతం బయట పడింది.

 

హార్వే .. తన కెరీర్ మొత్తంలో 80 మందికి పైగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు అప్పట్లో సంచలనం అయింది. దీని వల్లే మీటూ’ ‘కాస్టింగ్ కౌచ్’ ఉద్యమాలు ప్రపంచ వ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. హార్వే చేసిన లైంగిక వేధింపులతో చిత్ర పరిశ్రమలు తలదించుకున్నాయంటే కాదని వాధించే వారు లేకపోవడం ఆశ్చర్యకరం. హార్వే పై పోలీసుల అతి దారుణంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి అన్ని నిజాలను బయటకి కక్కించి 23 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ రేపిస్ట్ ప్రొడ్యూసర్ కి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయంపై జైలు అధికారులు మాత్రం జైలు అంతర్గత విషయాలు బయటకి చెప్పే అధికారం లేకపోవడం తో ఎలాంటి సమాచారం బయటకి వెల్లడించడం లేదని సమాచారం. ఇక హార్వే రీసెంట్ గా తన పుట్టిన రోజును జైలు గోడల మధ్యనే జరుపుకున్నాడు. ఇంతలోనే హార్వే కి కరోనా వ్యాపించందని తెలింది. అయితే హార్వే కరోనా సోకిందని తెలిసిన వాళ్ళు మాత్రం ఇలాంటి వాళ్ళకి సరైన శిక్ష పడిందని ఇంతమంది జీవితాలతో ఆడుకున్న దుర్మార్గుడికి కరోనా వంటి అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడటం తగిన శిక్షే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version