కొత్త‌లుక్‌లోకి మారిన నాగచైతన్య.. ఆ సినిమా కోసమేనట..!

-

టాలీవుడ్ లో మన్మధుడు నాగార్జున కుమారుడిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ గుర్తింపును సాధించి పెట్టుకున్నాడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). కుందనపు బొమ్మ సమంతను పరిచయం చేస్తూ… దర్శకుడు గౌతమ్ మీనన్ తీసిన ఏ మాయ చేసావే మూవీ నాగ చైతన్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది. అనంతరం చాలా చిత్రాలలో ఈ కుర్ర హీరో చేయగా… కొన్ని హిట్టయ్యాయి.

నాగచైతన్య /Naga Chaitanya

కొన్ని ఫట్టయ్యాయి. తనతో కలిసి సినిమా ప్రపంచానికి పరిచయమైన కుందనపు బొమ్మ సమంతను పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వెరైటీ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి లవ్ స్టోరీ సినిమా చేశాడు. ఆల్ రెడీ కంప్లీట్ అయినా కూడా కరోనా లాక్ డౌన్ కారణంగా లవ్ స్టోరీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

ఆ సినిమా పూర్తయిన వెంటనే దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో కలిసి.. థ్యాంక్యూ అనే మరో మూవీని లైన్ లో పెట్టాడు. ఇందులో నాగ చైతన్య డిఫరెంట్ లుక్ లో కనిసిస్తాడని వినికిడి. నాగ చైతన్య బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ తో కలిసి నటిస్తున్నాడు. ఇది చైతన్యకు తొలి బాలీవుడ్ మూవీ. లాల్ సింగ్ చ‌ధా సినిమాలో ఈ టాలీవుడ్ కుర్ర హీరో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇందు కోసం ఆయన ఆర్మీ జ‌వాన్ గా మారిపోయాడు. ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చైతన్య ఆమీర్ ఖాన్ స్నేహితుడిగా క‌నిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా నాగచైతన్య ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఆమీర్ ఖాన్ తో పాటు అతడి మాజీ భార్య కిరణ్ రావు కూడా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version