చైతు ,సామ్ లవ్ కి పదేళ్ళు…!

-

టాలీవుడ్ లో ఇప్పుడు సమంతా టాప్ హీరోయిన్. పెళ్లి అయినా సరే వరుసగా సినిమాలు చేస్తూ ముందుకి వెళ్తుంది. వస్తున్న అవకాశాలను కాదు అనుకుండా, భర్త, కుటుంబ సహకారంతో సమంతా ఇప్పుడు తనదైన శైలిలో ముందుకి వెళ్తుంది. అక్కినేని వారి కోడలు అయిన తర్వాత ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది అనేది వాస్తవం. పెళ్లి తర్వాత భర్త నాగ చైతన్యతో కలిసి పలు సినిమాల్లో నటించింది.

ఏం మాయ చేసావే’ సినిమాతో నాగ చైతన్య పక్కన జెస్సీగా నటించి ఆ తర్వాత ఆ తర్వాత వీళ్లిద్దరు కలిసి ‘మనం’, ‘ఆటో నగర్ సూర్య’ సినిమాల్లో కలిసి నటించారు. పెళ్లైన తర్వాత ‘మజిలీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయ౦ సాధించింది. వీళ్ళిద్దరూ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘ఏ మాయ చేసావే’ విడుదలై ఈ బుధవారంతో పదేళ్లు పూర్తి చేసుకోనుంది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే వీరు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత క్రమంగా సమంతా హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది. అగ్ర హీరోలు అందరి పక్కన సమంతా కనపడింది. మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున, ఇలా చాలా మంది హీరోల సరసన నటించింది సమంతా. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ త్రివిక్ర౦ సినిమాలో సమంతా నటిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version