ట్రంప్ బస చేసిన హోటల్ రూమ్ ఖర్చు ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

-

తొలిసారి భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. తొలి రోజు పర్యటన ఆద్యంతం అత్యంత స్నేహపూరిత వాతావరణం సాగింది. రెండో రోజు ఢిల్లీలోనే ట్రంప్ గడపనున్నారు. ఇక‌ రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్‌ఘాట్‌లోని మహాత్మ గాంధీ స్మారక స్థలాన్ని సందర్శించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం రెండవ రోజు పర్యటనను బిజీబిజీగా కొనసాగిస్తున్న ట్రంప్ బస చేసిన హోటల్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న రాత్రి ట్రంప్ దంపతులు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌లోని గ్రాండ్ ప్రెసిడెన్షియల్‌ సూట్‌లో బస చేశారు.

ఒక రాత్రి కోసం వారికి ఆ సూట్‌ను కేంద్ర ప్రభుత్వం బుక్ చేయగా.. ఆ గదికి ఒక రోజు అద్దె అక్షరాల 8 లక్షల రూపాయలు. ఇక ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘పెద్దన్న అంటే మాటలా.. ఆ మాత్రం మర్యాద లేకపోతే ఎలాగంటూ’ కామెంట్స్ చేస్తున్నారు. ఈ గది అత్యంత విలాసవంతంగా ఉంటుంది. అన్ని సదుపాయాలు ఈ గదిలో ఉన్నాయి. ఇదొక అపార్ట్‌మెంట్‌ను తలపిస్తుంది. వుడెన్ ఫ్లోరింగ్, గోడలపై అందమైన పెయింటింగ్స్, ఒక పెద్ద లివింగ్ రూమ్, నెమలి ఆకారంలో ఉండే ప్రైవేట్ డైనింగ్ రూమ్, విలాసవంతమైన రెస్ట్ రూమ్‌లతో పాటు రిసెప్షన్ ఏరియా, మిని స్పా, జిమ్‌లు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version