బెల్లంకొండకు భారీ షాక్.. హిందీ బెల్ట్ లో జీరో షేర్ నమోదు చేసిన చత్రపతి

-

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2014లో వివి వినాయక దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను చిత్రంతో తెలుగు వరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా అప్పట్లో పర్వాలేదు అనిపించినప్పటికీ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం 2017 లో వచ్చిన జయ జానకి నాయక సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు హీరో. ఈ క్రేజ్ తో తాజాగా రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హీట్ చత్రపతి సినిమాకు హిందీ రీమేక్ తీసి బాలీవుడ్ కి వదిలారు. కాగా ఈ సినిమాను అక్కడ ప్రేక్షకులు గట్టిగా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

దాదాపు 18 ఏళ్ల క్రితం తెలుగులో విడుదలైన చత్రపతి సినిమాను హిందీ రీమేక్ చేసి బాలీవుడ్ పై వదిలాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన మొదటి సినిమా దర్శకుడైన వివి వినాయక్ ఈ సినిమాను తెరకెక్కించగా రాజమౌళి క్రేజ్ ని ఉపయోగించుకుని హిందీలో పాపులారిటీ కొట్టేయాలని చేసిన బెల్లకొండ శ్రీనివాస్ ప్రయత్నాలు పూర్తిగా బెడిసి కొట్టాయి. మే 12న హిందీలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి నార్త్ ఆడియన్స్ గట్టి షాక్ ఇచ్చారు..

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి హిందీ బెల్ట్ లో జీరో షేర్ నమోదైనట్లు తెలుస్తోంది. కాగా హిందీ ఆడియన్స్ ఛత్రపతి చిత్రాన్ని ఎంతలా రిజెక్ట్ చేశారో అర్థం అవుతోంది. ఈ పరాజయంతో సినీ విశ్లేషకులు ఏది ఏమైనా బెల్లంకొండ తీసుకున్నా నిర్ణయం మాత్రం సరైనది కాదంటూ మరొకసారి చెప్పుకొస్తున్నారు.

2005లో దర్శకుడు రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన చత్రపతి సినిమా ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ ఇప్పటికీ ఆ సినిమా ఔట్ డేటెడ్ అనే చెప్పాలి. ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అందరూ చూసేసిన సినిమాని మళ్లీ దాదాపు 100 కోట్లు పెట్టి తెరకెక్కించటం ఆ సినిమాకి ఎన్ని కమర్షియల్ హంగులు అద్దినప్పటికీ లాభం లేకుండా పోయింది. బెల్లంకొండ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించారు. ఆర్ఆర్అర్ సినిమాని హిందీలో రిలీజ్ చేసిన పెన్ స్టూడియో సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయగా బెల్లంకొండ సురేష్ భారీగానే పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఎన్ని హంగులు అద్దినప్పటికీ ఈ సినిమా బెడిసి కొట్టిందని చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version