టాలీవుడ్ లో యంగ్ హీరోగా ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ గా నటించిన చిత్రం “చౌర్యపాఠం”. ఈ చిత్రం వాస్తవానికి ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదల అయింది. ధమాకా, మజాకా వంటి సినిమాలకు దర్శకుడిగా పని చేసిన త్రినాథరావు నిర్మాణంలో నక్కిన నెరేటివ్ బ్యానర్ పై నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజీవ్ కనకాల, సలీం ఫేక్, సుప్రియ పలువురు కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. ఓ కుర్రాడు చాలా ప్రయత్నాలు చేసి తానే నిర్మాతగా వ్యవహరించి.. సొంతంగా ఓ సినిమా చేయాలనుకుంటాడు. కానీ తన వద్ద అంత మొత్తంలో డబ్బులు లేకపోవడంతో ఓ భారీ స్కెచ్ వేస్తాడు. సినిమా నిర్మించేందుకు అవసరమైన డబ్బు సంపాదించలేమని తెలిసి ఓ గ్రామంలో ఉన్న బ్యాంక్ లో దొంగతనం చేసేందుకు ప్లాన్ వేస్తాడు. అసలు ఆ బ్యాంకులో డబ్బు దొంగిలించాడా..? లేదా అనే కథనం సస్పెన్స్ గా కొనసాగుతోంది.
ఇక మధ్య మధ్యలో తనదైన కామెడీతో నవ్వించారు. ఆ బ్యాంకు రాబరీ సమయంలో హీరో కొన్ని నిజాలను తెలుసుకుంటారు. హీరో తెలుసుకున్న ఆ నిజాలు ఏంటి..? అనేది కూడా సస్పెన్స్ గానే ఉంటుంది. ఓ వైపు సస్పెన్స్ ఉంటూనే.. మరోవైపు కామెడీని పండించారు మేకర్స్. అమేజాన్ ప్రైమ్ లో మే 27న స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ సూపర్ సక్సెస్ ఫుల్ గా 200కి పైగా మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టింది. చిన్న సినిమాల్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో హీరోగా నటించిన ఇంద్రారమ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్ననాయి. అలాగే నటుడు ఇంద్రరామ్ తాజాగా రెండో సినిమాతో మరో ప్రయోగాత్మక కథనంతో రాబోతున్నాడు. ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.