నాలుగేళ్ల తర్వాత కోలీవుడ్​లో చిన్మయి డబ్బింగ్‌.. సమంత ఫుల్ ఖుష్

-

సింగర్ చిన్మయి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. కేవలం సింగర్​గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా ఈమె ఫేమస్. ముఖ్యంగా సమంతకు డబ్బింగ్ చెప్పడంతో చిన్మయికి పాపులారిటీ వచ్చింది. అయితే ఈమెపై తమిళ సినిమా ఇండస్ట్రీ బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల నిషేధం అనంతరం తమిళ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకు చిన్మయి డబ్బింగ్‌ చెప్పింది. లియో సినిమాలో త్రిష పాత్రకు తెలుగు, తమిళం, కన్నడలో డబ్బింగ్ చెప్పినట్లు ఇటీవల చిన్మయి తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

దీనిపై సమంత స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. సంబంధిత వార్త లింక్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసి ఫైర్‌ ఎమోజీ జోడించింది. సమంత, చిన్మయి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ సంగతి తెలిసిందే. ‘ఏ మాయ చేసావె’ సినిమాతో వారి ఫ్రెండ్షిప్ మొదలైంది. ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’ తదితర చిత్రాలతోపాటు ఇటీవల వచ్చిన ‘ఖుషి’లోని సమంత పాత్రకు చిన్మయినే వాయిస్‌ ఇచ్చింది.

ఇక లియో సినిమా సంగతికి వస్తే విజయ్‌- లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version