వైద్యులపై పుష్పాభివందనం.. చిరు ఎమోషనల్ ట్వీట్

-

చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉగాది రోజున మొదలైన ట్వీట్ల దండయాత్రం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. మంచి సందేశాలు ఇవ్వడానికి, తన సహచర నటీనటులకు, దర్శకులకు సెటైర్స్, పంచ్‌లు వేయడానికి ఈ మాధ్యమాన్ని బాగానే వాడుకుంటున్నాడు. చిరు వేసే ట్వీట్స్ కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారంటే అది అతిశయోక్తి కాదు. ఎప్పుడు ఎవరికి మూడుతుందో.. ఎవరి మీద సెటైర్స్ వేస్తారో అని ఆత్రుతగా చూస్తుంటారు నెటిజన్స్.

Chiranjeevi Tweets About SHowering Flowers On Doctors AT Gandhi hospital

తాజాగా ఆయన వేసిన ఓ ట్వీట్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుని ఉంది. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి చేజారిపోతోంది. దాదాపు 40 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల రేటు కూడా పెరుగుతోంది. కరోనా నుంచి మన సమాజాన్ని రక్షిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ద్య కార్మికులకు కూడా కరోనా సోకుతోంది. అయినా ఏ మాత్రం ప్రాణాల గురించి ఆలోచించకుండా నిస్వార్థ సేవలను అందిస్తున్నారు.

ఈ మేరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్న వైద్య బృందంపై భారత వాయు సేన పూల వర్షాన్ని కురిపించింది. ఈ మేరకు గాంధీ ఆస్సత్రి ఆవరణంలో హెలీకాప్టర్ ద్వారా వైద్యులపై పూల వర్షాన్ని కురిపించారు. దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. ‘సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదుల పైన పోరాడి, దేశాన్ని కాపాడే వీర సైనికులు, కనిపించని వైరస్ అందరిపైన దాడి చేస్తుంటే, అహర్నిశం మనల్ని కాపాడేందుకు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యబృందానికి పుష్పాభివందనం చేయటం అభినందనీయం. మేమంతా మీకు రుణపడి ఉంటాము. మీరే నిజమైన హీరోలు’ అంటూ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version