అవునవును.. నేను ఆగలేకపోతోన్నా : నిహారిక కొణిదెల

-

నిహారిక కొణిదెల పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఇటు బుల్లితెరపై యాంకరింగ్‌తో ఎంతో మందిని కట్టిపడేసిన నిహారిక వెండితెరపై ఆ మ్యాజిక్‌ను చూపించలేకపోయింది. చేసిన ప్రతీ సినిమా బోల్తాకొట్టింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం ఇలా ప్రతీ చిత్రం ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఈ దెబ్బతో సినిమాలకు దూరంగానే ఉంటూ వస్తోంది నిహారిక. అయితే వెబ్ సిరీస్‌లో మాత్రం ఈ అమ్మడు మంచి సక్సెస్‌ను సాధించింది.

Niharika Konidela Next Project In Kollywood With Ashok Selvan

ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి అంటూ వెబ్ సిరీస్‌లతో సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం కూడా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే ఈ మధ్య నిహారిక మాట్లాడుతూ పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెబుతాననే సంకేతాన్ని ఇచ్చింది. ఆ మధ్య నాగబాబు కూడా మాట్లాడుతూ.. త్వరలోనే నిహారికకు పెళ్లి చేస్తామని కూడా చెప్పుకొచ్చాడు. కానీ తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాన్ని ప్రకటించింది.


తమిళంలో చేయబోతోన్న ఈ ప్రాజెక్ట్‌పై అక్కడి మీడియా బాగానే శ్రద్దపెట్టినట్టుంది. దీనికి కారణం ఈ మధ్య విడుదలైన ఓ మై కడవలే హిట్ కావడం, హీరో అశోక్ సెల్వన్‌కు మంచి పేరు రావడమే. అయితే అశోక్ సెల్వన్, నిహారిక కాంబోలో ఓ సినిమా రాబోతోందని అక్కడి మీడియా రాసిన వార్తలకు స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘అవుననను.. నా తదుపరి చిత్రం అశోక్ సెల్వన్‌తో.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను.. షూటింగ్ ఎప్పుడా? అని ఆగలేకపోతోన్నా’నని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version