ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్ లోని ఓ పాఠశాలలో చదువుతున్న మార్క్.. ఇవాళ ఉదయం స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ఘటనలో పదేళ్ల విద్యార్థిని మరణించింది. మరో 10 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. తన కార్యక్రమాలు ముగించుకుని సింగపూర్ బయల్దేరాడు.
అయితే తన సోదరి కుమారుడు అయిన మార్క్ ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా సింగపూర్ పయనం అవుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఏం జరిగిందో ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం మార్క్ ఆరోగ్యం బాగానే ఉందని.. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయని.. ప్రస్తుతం అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చిరు తెలిపారు. ఈ నేపథ్యంలో మార్క్ ను చూసేందుకు.. పవన్ కు ఈ కష్టకాలంలో సపోర్టుగా నిలిచేందుకు చిరంజీవి ఆయన సతీమణి సురేఖతో కలిసి సింగపూర్ వెళ్లనున్నారు.