సిటాడెల్ ప్రమోషన్స్ లో బోల్డ్ లుక్ లో సమంత రచ్చ

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే వర్క్ మోడ్లోకి వచ్చింది. మయోసైటిస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ తను నటించిన వెబ్ సిరీస్ సిటాడెల్ ఇండియన్ వెర్షన్ ప్రమోషన్స్లో పాల్గొంటోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్కు సంబంధించి పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అయితే ఈ ప్రచారంలో సమంత బోల్డ్ లుక్స్ను ఎంచుకుంది. సిటాడెల్ ప్రమోషన్స్లో సామ్ దాదాపుగా బోల్డ్ ఔట్ఫిట్లోనే కనిపిస్తోంది.

తాజాగా సామ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్లో హీట్ పుట్టిస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ ఘాటు పోజులిస్తూ సామ్ నెట్టింట సొగసుల బాంబ్ విసిరింది. ఈ ఫొటోలు చూసి కుర్రకారు బేజారై పోతున్నారు. ఇన్నాళ్లూ మేం చూసిన సమంతేనా ఇలా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్కు వెళ్లాక సామ్ చాలా మారిపోయిందంటూ ఇంకొందరు అంటున్నారు. ఇక సామ్ సపోర్టర్సేమో ఏ లుక్ అయినా సమంత ఇచ్చి పడేస్తుందంటూ మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు సమంత ప్రస్తుతం సిటాడెల్ కాకుండా కొత్తగా ఇంకా ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version