BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని తెలంగాణ అసెంబ్లీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. అలాగే సస్పెండ్ అయిన సభ్యుడిని సభ నుండి బయటకు పంపాలని ఆదేశాలు ఇచ్చారు స్పీకర్. అయితే జగదీష్ రెడ్డి నీ సస్పెండ్ చేసేందుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదన చేయగా.. ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.
అయితే ఈ సస్పెన్షన్ పై సభ లో BRS సభ్యుల నిరసన తెలిపారు. ఆ తర్వాత సభ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో పరిశీలించారు స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు, సీతక్క. స్పీకర్ నీ ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నారు. సభ్యులను ఉద్దేశించి మీరు ముసుకోండి.. అని జగదీష్ రెడ్డి అన్నట్టు ఆడియో రికార్డు అయ్యిందంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. వీడియోను పరిశీలించిన తర్వాత ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్.