అమరావతి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం : వైసీపీ ఎమ్మెల్సీ

-

2014 -19 లో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడింది. 2014-19 మధ్య జరిగినన్ని స్కాములు దేశంలో ఎక్కడా జరగలేదు. దేశంలోనే ఏపీ అవినీతిలో మొదటి స్థానంలో ఉందని జపాన్ కు చెందిన నేషనల్ కౌన్సిల్ నివేదిక ఇచ్చింది అని వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. 2014-19 మధ్య జరిగిన అతిపెద్ద కుంభకోణం అమరావతి భూముల స్కామ్. అమరావతి కోసం 34వేల ఎకరాలు సేకరించారు. 1843 అసైన్డ్ భూములు ఆక్రమించారు. అమరావతి అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం. అమరావతి కుంభకోణం పై ఎంక్వైరీ జరిగింది. మీకు చేతనైతే ఆ ఎంక్వైరీ బయటపెట్టండి.

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో విచారణ జరిపించండి. విచారణకు సహకరించకుండా అప్పటి ముఖ్యమంత్రి పీఏని దేశం దాటించేశారు. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందు కొందరు మంత్రులు బినామీల పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించారు. అమరావతిలో తాత్కాలిక భవనాలకు 1150 కోట్లు ఖర్చు చేశారు. ఈ తాత్కాలిక భవనాల నిర్మాణంలో పెద్ద స్కామ్ జరిగింది. గట్టిగా వర్షం వస్తే ఈ ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాని చెప్పారు. ప్రధానితో ఆ మాట అనిపించుకోవడానికి అప్పటి టిడిపి ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా.. మీకు ధైర్యముంటే గత విచారణను బయటపెట్టి మాట్లాడండి అని వైసీపీ ఎమ్మెల్సీ కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version