జగదీష్ రెడ్డి అంశంపై స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. జగదీష్ రెడ్డి స్పీకర్ ను అవమాణించలేదు. సభ మీ ఒక్కరిదీ కాదు – సభ అందరి అన్నారు. మీ అనే పదం సభ నిబంధనలకు విరుద్ధం కాదు అని ఆయన తెలిపారు. అలాగే మీ ఒక్కరిదీ అనే పదం అన్ పార్లమెంట్ పదం కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తెలీదు. సభను ఎందుకు వాయిదా వేశారో తెలీదు అని పేర్కొన్నారు.
అయితే కాంగ్రెస్ డిస్పెన్స్ లో పడింది. స్పీకర్ ను కలిశాం.. రికార్డు తీయాలని అడిగాం. దళితుడు, అగౌవరం పరిచే విధంగా జగదీష్ రెడ్డి మాట్లాడలేదు. జగదీష్ రెడ్డి మాట్లాడిన సభ వీడియో రికార్డు స్పీకర్ ను అడిగాం. 15 నిమిషాల అయినా వీడియో రికార్డు స్పీకర్ తెప్పించలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద BRS ఎమ్మెల్యేలను మాట్లాడకుండా బ్లాక్ చేశారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకపోతే అవిశ్వాసం పెడతాం అని హరీష్ రావు పేర్కొన్నారు.