ఈ ఏడాది ఆరంభంలోనే `అల వైకుంఠపురములో` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇదే జోష్‌తో సుకుమార్‌కు నెక్ట్స్ సినిమా విషయంలో గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం `పుష్ప`. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. శేషాచల అడవుల నుంచి సాగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. చాలా రోజులుగా చర్చల దశలో ఉన్న మరో సినిమా విషయంలో కూడా క్లారిటీ ఇచ్చాడు బన్నీ. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు బన్నీ. ఆ సినిమాకి ‘ఐకాన్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘దిల్’ రాజు నిర్మాతగా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతుండగా, త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో ప్రాజెక్ట్ సెట్ అయింది. ఆ సినిమా విడుదలైన తరువాత సుకుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో ‘ఐకాన్’ ఊసే లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంతా అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. 21వ సినిమాగా ఐకాన్ సినిమా పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను బన్నీ బర్త్‌డే సందర్భంగా నేడు విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో బన్నీ కి జంటగా నటించేది ఎవరు అలాగే మిగితా నటీనటులు వివరాలు మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ తో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలైన తరువాత అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఏదైతేనేం ఐకాన్‌పై ఎట్టకేలకు కారిటీ వచ్చింది.