సంధ్య థియేటర్ ఘటనపై తన తండ్రి అల్లు అరవింద్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు హీరో అల్లు అర్జున్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక సంధ్య థియేటర్ ఘటన ఒక యాక్సిడెంట్ అని.. అది అనుకోకుండా జరిగిందన్నారు. ఈ ఘటన జరిగినందువల్ల రేవతి కుటుంబానికి క్షమాపణలు తెలియజేశారు. సంధ్య థియేటర్ ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు.
ఇందులో ఎవరి తప్పు లేదన్నారు అల్లు అర్జున్. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. సినిమా పెద్ద హిట్ అయిన 15 రోజులుగా ఇంట్లో కూర్చొని బాధపడుతున్నానన్నారు. తెలుగు వారి ఖ్యాతిని పెంచేందుకు ఈ సినిమా తీశానని.. కానీ జాతీయ మీడియా ముందు తనని అప్రతిష్ట పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనుమతి లేకుండా థియేటర్ వెళ్లానని అనడం అబద్ధం అన్నారు.
పోలీసుల అనుమతితోనే థియేటర్ కి వెళ్ళానన్నారు అల్లు అర్జున్. కొందరి వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఓ ఎమ్మెల్యే ఉద్దేశించి అన్నారు. సంధ్య థియేటర్ లో ఓ మహిళ చనిపోయినట్లు తనకు మరుసటి రోజు తెలిసిందన్నారు. తాను ప్రభుత్వంతో ఎలాంటి వివాదం కోరుకోవడం లేదని. తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని కోరుతున్నారన్నారు.