మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తూ.. కొన్నాళ్ల పాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే 155 సినిమాలు చేశారు. ప్రస్తుతం 156వ సినిమా విశ్వంభర. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది భారతదేశంలో అత్యంత ప్రతిస్టాత్మకమైన అవార్డుల్లో రెండో అవార్డును దక్కించుకున్నారు.
మొత్తం 156 సినిమాల్లో 537 సాంగ్స్ కి గాను 24వేల డ్యాన్స్ మూవ్స్ కి ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ లో అనౌన్స్ చేశారు. టాలీవుడ్ లో గిన్నీస్ రికార్డు కేవలం బ్రహ్మానందం పేరిట ఉంది. ఆయన 759 సినిమాల్లో నటించినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. “చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారికి నా అభినందనలు” అని ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version