Guinness Book of Records : ఈ గౌరవాన్ని నేను అస్సలు ఊహించలేదు : చిరంజీవి

-

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వయస్సు పై బడినప్పటికీ కుర్ర హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఇటీవలే అక్కినేని నాగేశ్వరరావు అవార్డు కూడా ఎంపికయ్యారు. తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు చిరంజీవి. 46 ఏళ్లలో 156 సినిమాల్లో నటించి 537 సాంగ్స్ కి 24000 డ్యాన్స్ మూమెంట్ చేసినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.

తాజాగా అవార్డు అందుకున్న చిరంజీవి మాట్లాడుతూ గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం తాను అస్సలు ఊహించలేదన్నారు. నిర్మాతలు, దర్శకుల చొరువతోనే ఇది సాధ్యం అయిందని తెలిపారు. నటన కంటే ముందే తాను చిన్నతనం నుంచే డ్యాన్స్ పై ఆసక్తి కనబరిచినట్టు వెల్లడించారు. అదే ఈ గౌరవానికి కారణం అన్నారు. డ్యాన్స్ తన జీవితంలో అంతర్భాగమైందన్నారు. అది నటనలో తనకు బెనిఫిట్ గా మారిందని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Exit mobile version