నేను బాగానే ఉన్నా.. ఆ వార్తలు నమ్మకండి : కమెడియన్‌ సుధాకర్‌

-

టాలీవుడ్ కమెడియన్ సుధాకర్​ ఆరోగ్యంపై గత కొంతకాలంగా పలు రకాల పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అయితే ఏకంగా ఆయన చనిపోయారని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో సుధాకర్ ఈ వార్తలపై స్పందించారు. తన గురించి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై సుధాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని చెప్పారు. ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దని కోరారు.

‘‘నా మీద కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు. తప్పుడు సమాచారాన్ని నమ్మకండి. ఇలాంటి రూమర్స్‌ను ప్రచారం చేయకండి. నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని సుధాకర్‌ తెలిపారు. దీంతో ఇలాంటి తప్పు సమాచారం వైరల్‌ చేస్తున్న వారిపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న మనిషిపై ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయెద్దంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. సహాయ నటుడిగా, విలన్‌గా… తెలుగు, తమిళ ప్రేక్షకులను మెప్పించారు. కొన్ని సంవత్సరాలుగా సుధాకర్ సినిమాలకు దూరంగా ఇంట్లోనే ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version