సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా నటించిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున, అమీర్ ఖాన్, శోభన్, శృతిహాసన్ అలాగే ఉపేంద్ర లాంటి కీలక నటీ నటులు ఉన్నారు. ఈ సినిమా పంద్రాగస్టు నేపథ్యంలో ఇవాళ రిలీజ్ చేశారు. వార్ 2 సినిమా కూడా ఇవ్వాలే రిలీజ్ అయింది. అయితే ముందుగా కూలీ సినిమా బాగుంటుందని అందరూ అంచనాలు వేశారు. కానీ రియాలిటీలో… ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున నటన తప్ప.. ఏ ఒక్క సీన్ బాగాలేదని చర్చ జరుగుతోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ అస్సలు బాగా లేదట. ఫస్టాఫ్ కాస్త చూడవచ్చని చెబుతున్నారు. ఉపేంద్ర అలాగే అమీర్ ఖాన్ పాత్రలు ఎందుకు పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొందని అంటున్నారు. రజినీకాంత్ యాక్టింగ్ అదరగొట్టాడని చెబుతున్నారు. పాత పాటలే.. ఫైట్ సీన్స్ ఉన్నప్పుడు ప్లే చేశారట. అదొక్కటి ఈ సినిమాలో కొత్తగా కనిపించింది అని చెబుతున్నారు. కేవలం 20 నిమిషాల సినిమా తప్ప అంతా చెప్తే అని అంటున్నారు. ఓవరాల్ గా.. ఎన్నో అంచనాల మధ్య వెళ్లిన అభిమాని..కూలీ సినిమా చూసి ఖునీ అవుతాడని అంటున్నారు.