వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. పరిగి మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, రంగాపూర్, న్యామత్‌నగర్ గ్రామాల్లో మూడు సెకండ్ల పాటు స్వల్పంగా కంపించింది భూమి.

వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్న తరుణంలో జనాలు నిద్రలోంచి లేచి, ఉలిక్కి పడ్డారు. ఇక అటు రెండు తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ అలాగే ఏపీని వర్షాలు ఏమాత్రం వదలడం లేదు. ఇవాళ కూడా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు.