కరోనా ఎఫెక్ట్ : థియేటర్లు మూసివేత.. వాయిదా పడ్డ సినిమాలు

-

కరోనా కరోనా కరోనా.. ఎక్కడ చూసినా ఇదే పేరు. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ భారతదేశంలోనూ విస్తరిస్తోంది. కేరళలో మొదటి కేసును గుర్తించారు. తెలంగాణలోనూ కరోనా కేసును నిర్ధారణైంది. కరోనాను అరికట్టేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆ క్రమంలో రద్దీ ఉండే ప్రాంతాలైన థియేటర్లను మూసి వేయాలని కేరళ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.

ఈ క్రమంలోనే కేరళ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీతో చర్చలు జరిపింది. మార్చి 31 వరకు థియేటర్లను మూసివేయాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమం దృష్ట్యా, ప్రజల ఆరోగ్యగం మేరకు  ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పుకొచ్చింది. అయితే ఈ నిర్ణయానికి ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేరళ పరిశ్రమ అంతర్గతంగా ఓ నిర్ణయం తీసుకుంది.

కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రంజిత్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విన్నపం మేరకు మార్చి 16 వరకు థియేటర్లను మూసి వేస్తాం. ఆ తరువాత మళ్లీ రివ్యూ కమిటీ, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకు పొడిగించాాలా? అనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నాడు.  ఈ మేరకు మోహన్ లాల్ మరక్కార్ అనే భారీ బడ్జెట్ చిత్రం వాయిదా పడక తప్పలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version