పుష్ప సినిమాపై ఇంటర్నెట్ లో ఆసక్తి కలిగిస్తున్న వార్త.. నిజమైతే అభిమానులకి పండగే..

-

పుష్ప సినిమా రిలీజ్ డేట్ ని సడెన్ గా ప్రకటించిన అభిమానులకి అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న పుష్ప సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. రంగస్థలం సినిమాతో మాస్ జనాలకి దగ్గరైన సుకుమార్, పుష్ప సినిమాతో మాస్ జనాల్లో నిలబడిపోయేలా ఉన్నాడు. ఐతే తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ గురించి ఇంటర్నెట్ లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

దానికి కారణం బన్నీ ఎడమ కాలుకి ఆరవ వేలు లేకపోవడమే. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినపుడు కనిపించిన ఆరవ వేలు రిలీజ్ పోస్టర్ లో ఎందుకు లేదనేది వారి ప్రశ్న. ఐతే ఈ విషయమై అనేక పుకార్లు సృష్టిస్తున్నారు. పుష్ప సినిమాలో బన్నీది డ్యుయల్ రోల్ అని, లారీ డ్రైవర్ గా, బిజినెస్ మేన్ గా కనిపిస్తాడని అంటున్నారు. కొంతమంది ఈ విషయం నిజం కాకపోవచ్చని, ఫస్ట్ లుక్ లో, రిలీజ్ పోస్టర్లో గెటప్ ఒకేలా ఉందని, కాబట్టి అలా ఆలోచించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version