థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలతో ఫ్లాపులు మూటగట్టుకున్న యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో ఇటీవలే థియేటర్లలో సందడి చేశారు. ఈ సినిమా ద్వారా అయినా హిట్ కొట్టాలని ప్రయత్నించిన చైకి ఈసారీ నిరాశే ఎదురైనట్లు కనిపిస్తోంది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ మే 12న థియేటర్లలో రిలీజై డీసెంట్ టాక్‌ను అందుకుంది.
అయితే ఈ సినిమా ఫలితంపై మిశ్రమ అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కొంతమంది బాగుందని అంటుంటే మరికొంతమంది మాత్రం ఆశించిన స్థాయిలో లేదని కూడా అంటున్నారు. వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదని.. కాస్త నిరాశపరిచిందని సమాచారం. వరల్డ్ వైడ్‌గా రూ.4కోట్ల గ్రాస్ కన్నా తక్కువ వచ్చాయని తెలిసింది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఈ సినిమాకు రూ. 2.30 నుంచి రూ. 2.50 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు తెలిసింది. అలాగే.. తమిళంతో పాటు మిగతా ప్రాంతాలను కూడా కలిపితే మొత్తంగా రూ. 3.30 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల వరకు వచ్చాయట.
అలానే యూఎస్ఏలో ప్రత్యంగిరా సినిమాస్ కస్టడీ చిత్రాన్ని విడుదల చేసింది. అక్కడ తొలి రోజు(ప్రీమియర్స్‌తో కలిపి) లక్ష డాలర్స్ మార్క్‌ను క్రాస్ చేసిందని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్ చేసింది.