అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన వారసులు.. కట్ చేస్తే..!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వానికి కొదవ లేదని చెప్పవచ్చు. ఇక ఇప్పటికే ఎంతో మంది సినీ ఇండస్ట్రీలోకి వారసత్వంగా అడుగుపెట్టిన వారు ఉన్నారు. కానీ ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడతారు.. లేకపోతే ఇంటికి తిరిగి వెళ్లాల్సిందే. ఇక ఈ ఏడాది ఇప్పటికే ఇద్దరు కొత్త హీరోలు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీరిద్దరు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన వారే కావడం గమనార్హం. ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి.. హీరోలు గా మారిన మన సినీ తారల వారసులెవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

అశోక్ గల్లా:సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా మహేష్ బాబు మేనల్లుడిగా గల్లా అశోక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి . విదేశాలలో శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసిన అశోక్ గల్లా ఇప్పుడు హీరో మూవీ తో హీరోగా సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నాడు. ముఖ్యంగా మహేష్ మేనల్లుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఇక మీదట మరిన్ని సినిమాలలో హీరోగా చేయాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.

ఆశిష్:తెలుగు సినీ ఇండస్ట్రీలోని బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన ఎక్కువగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు .దిల్ రాజు సోదరుడి కొడుకు అయిన ఆశిష్ కూడా రౌడీ బాయ్స్ సినిమా ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు. ఇకపోతే కేరింత మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ తర్వాత ముంబై , అమెరికాలో ఫిలిం శిక్షణ పొందాడు.

ఇక అలా ఈ ఏడాది అశోక్ , ఆశీష్ లు ఇద్దరూ కూడా తమ టాలెంట్ తో స్టార్ హీరోలుగా నిలబడతారో లేదో చూడాలి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version