దీపావళి టపాసులపై తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు

-

దీపావళి వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీపావళి టపాసులపై నిబంధనలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బేరియం సాల్ట్ తో తయారు చేసిన క్రాకర్స్ ను అమ్మవద్దని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకే బేరియం సాల్ట్ తో తయారు చేసిన టపాసులను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. సుప్రీం కోర్ట్ ఉత్తర్వులను తప్పకుండా అమలు చేయాలని సీఎస్ ఆదేశించారు. నిబంధలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం అని సీఎస్ హెచ్చరించారు.

తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో టపాసులపై నిషేధం కొనసాగుతోంది. ఇటీవల కోల్ కతా హైకోర్ట్ బెంగాల్లో క్రాకర్స్ నిషేధిస్తూ ఉత్తర్వులను జారీచేస్తే.. సుప్రీం కోర్ట్ దీనిని తోసిపుచ్చింది. అన్ని రకాల క్రాకర్స్ కు కాకుండా కేవలం గ్రీన్ క్రాకర్లకే అనుమతి ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా దీపావళి టపాసులపై కీలక నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version