ధ‌నుష్ – ఐష్ : శివ‌య్య‌దే భారం..విడిపోయిన స్టార్ హీరో జంట! 

-

అంతా శివేచ్ఛ అని
చెప్ప‌డం సులువు
సంబంధిత కాలం
సంబంధిత జ్ఞానం
ఎవ‌రివి?
మ‌నుషుల‌వే!
అయినా భారం శివ‌య్య‌కు!
ఈ క‌న్నీటి రాత .. ర‌జనీ ఇంట!
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ ఇంట!
శివ‌య్య‌దే భారం అని చెప్ప‌డంతో అర్థం తేలిపోయింది.లేదా స్ప‌ష్టం అయి ఉంది.ఓ జంట త‌మ విడాకుల‌కు ఆ ప‌ర‌మేశ్వ‌రుడినే సాక్షిగా ఉంచారు.భ‌గ‌వంతుడి స‌న్నిధిలో రాసిన ఓ క‌న్నీటి రాత ఇది అని భావించి, రానున్న కాలంలో రెండు వేర్వేరు దారుల్లో ప్ర‌యాణించే ఆ ఇద్ద‌రూ మ‌రింత మ‌నఃశాంతి అందుకోవాల‌ని ఆశిద్దాం.ఇదే అభిమానుల ప్రార్థ‌న కూడా! మా నిర్ణ‌యాన్ని మీరు గౌర‌వించండి అని ధ‌నుష్ కోరినా, అన్ని విడాకుల ప్ర‌క‌ట‌నల మాదిరిగానే ఈయ‌న మాట కూడా ఉంది అన్న‌ది సుస్ప‌ష్టం.
వివ‌రాల్లోకి వెళ్తే…
త‌మిళ‌నాట స్టార్ హీరో ధ‌నుష్, ఐశ్వ‌ర్య జంట విడిపోయారు.ట్విట‌ర్ వేదిక‌గా ధ‌నుష్ ఓ లేఖ‌ను పోస్టు చేసి విడాకుల ప్ర‌క‌ట‌న‌ను అధికారికంగా వెల్ల‌డించారు. లేఖ చివ‌ర్లో ఓం న‌మః శివాయ అని రాసి త‌న రాత‌కు తాత్విక ముగింపు ఒక‌టి ఇచ్చారు.18 ఏళ్లుగా క‌లిసి ఉన్న త‌మ జంట విడిపోయేందుకు నిర్ణ‌యించుకుంద‌ని చెప్పారు. కార‌ణాలేవయినా స‌రే ! ఈ నిర్ణ‌యంతో ఇండ‌స్ట్రీ అంతా విస్మ‌యానికి గుర‌యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version