ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ మోనాలిసా భోంస్లే అనే యువతి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక ఆమె పాపులారిటీ చూసి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ పై ఓ యువతి ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పి సనోజ్ తనని మోసం చేశారంటూ ఝాన్సీకి చెందిన ఒక యువతి ఫిర్యాదు చేయడంతో .. ఢిల్లీ పోలీసులు తాజాగా ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
2020లో సనోజ్‌తో ఇన్‌స్టా వేదికగా తనకు పరిచయం ఏర్పడిందని.. సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ తరచూ ఫోన్ కాల్స్ చేస్తుండేవాడని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఓసారి అతడు ఝాన్సీకి వచ్చి తనకు ఫోన్ చేసి చెప్పిన చోటుకు రాకపోతే చనిపోతానని బెదిరించాడని.. వెళ్లి కలిస్తే రిసార్ట్‌కు తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి వేధించాడని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అసభ్య వీడియోలు చిత్రీకరించి .. ఆ వీడియోలు బయట పెడతానని బెదిరిస్తూ పలుమార్లు తనపై అత్యాచారం చేశాడని బాధితారాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసినట్లు సమాచారం.