వెంకీ దెబ్బ‌కు మ‌రో ద‌ర్శ‌కుడు బ‌లి..

-

సురేష్ ప్రొడ‌క్ష‌న్‌లో ఏ ద‌ర్శ‌కుడు అయినా సినిమా చేయాలంటే ఓ ప‌ట్టాన తెమ‌ల‌దు. సురేష్‌బాబు క‌థ వింటాడు.. ఎన్నో మార్పులు, చేర్పులు చేస్తాడు. అయినా ఓకే అవుతుందో ?  లేదో ?  తెలియ‌దు. ఇక వెంకీ, రానా ఏ సినిమా చేయాల‌న్నా ఇప్ప‌ట‌కీ సురేష్‌బాబుకే క‌థ చెప్పాలి. ఇక వెంకీ సినిమా చేయాల‌న్నా కూడా క‌థ విని నెల‌ల త‌ర‌బ‌డి నాన్చుతాడ‌న్న అప‌వాదు ఉంది. ఇలా వెంక‌టేష్ చేతిలో చాలా మంది దెబ్బ‌లు తిన్నారు. అశోక్, తేజ రీసెంట్ బాధితులు. తాజాగా ఈ లిస్ట్ లోకి మరో దర్శకుడు కూడా చేరాడు. అతడి పేరు త్రినాథరావు నక్కిన.

చాలా క‌ష్టం మీద ఓ స్టోరీతో వెంకీని మెప్పించిన త్రినాథ‌రావు ఆ సినిమా స్క్రీన్ ప్లే కోసం త‌న ఆస్థాన ర‌చ‌యిత బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్‌తో క‌లిసి మ‌రో మూడు నెల‌లు కూర్చొన్నాడు. మ‌ళ్లీ వెంకీని క‌లిసి ఈ స్క్రీన్‌ప్లే వినిపిస్తే అది మ‌నోడికి న‌చ్చ‌లేదు. అలా ఏడెన‌మిది నెల‌ల పాటు ద‌గ్గుబాటి కాంపౌండ్‌లో తిరిగిన త్రినాథ‌రావు ఇప్పుడు అక్క‌డ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడ‌ట‌.

వెంకీ కోసం రాసుకున్న స్క్రిప్ట్ ను స్క్రీన్ ప్లేతో పాటు యథాతథంగా రవితేజకు వినిపించ‌డం ర‌వితేజ ఓకే చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయ‌ట‌. త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఆ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే వెంకీ కోసం త్రినాథ‌రావు రాసిన క‌థ‌తోనే ర‌వితేజ – త్రినాథ‌రావు కాంబోలో సినిమా సెట్స్‌మీద‌కు వెళ్ల‌నుంద‌ట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version