“డిజాస్టర్ లైలా” అంటూ సోషల్ మీడియాలో వైసీపీ రచ్చ!

-

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన యంగ్ హీరో విశ్వక్ తాజాగా నటించిన సినిమా లైలా. లేడీ గెటప్ లో చేసిన తొలి సినిమా కావడంతో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా… తెరకెక్కించారు. అయితే సినిమా మొత్తం బాగానే తీశారు. ఇవాళ థియేటర్లో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ట్విట్టర్ లో రివ్యూలు కూడా రాసేస్తున్నారు. ఈ నేపథ్యంలో… విశ్వక్ కు వైసిపి సోషల్ మీడియా ఊహించని షాక్ ఇచ్చింది.

Disaster Laila on social media YCP is uproar

ఇప్పటికే బైకాట్ లైలా సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా… ఇప్పుడు డిజాస్టర్ లైలా అంటూ రచ్చ చేస్తోంది. దీంతో డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్.. సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే 90 వేల మంది ఈ హ్యాష్ ట్యాగ్ వాడి పోస్టులు పెట్టారు… దీంతో విశ్వక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news