జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ అలాగే లక్ష్మి కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో జనసేన నేత కిరణ్ రాయల్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎట్టకేలకు జనసేన నాయకులు కిరణ్ రాయల్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. బాధితురాలు లక్ష్మీరెడ్డి ఫిర్యాదుతో కిరణ్ పైన చీటింగ్ కేసు నమోదు చేశారు. సెక్షన్ ఐపీసీ 420, 417 అలాగే 506 కింద కేసులు పెట్టారు పోలీసులు.

ఎస్ వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఎఫ్ ఐ ఆర్ నమోదు అయింది. మాయ మాటలతో తనను నమ్మించి మోసం చేయడమే కాకుండా చంపేస్తానని… బెదిరింపులకు పాల్పడినట్లు లక్ష్మీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక లక్ష్మి ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు… తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ పైన ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.