DJ Tillu : ‘ డీజే టిల్లు’ ట్రైలర్ రిలీజ్..బట్టలు చింపుకున్న బన్నీ !

-

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తాజా సినిమా డీజే టిల్లు. అట్లే ఉంటది మనతోనే అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. విమల్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను pdv ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా… పోస్టర్లు అలాగే సాంగ్స్ కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం.

అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇక ఈ ట్రైలర్ లో హీరో సిద్ధూ అలాగే హీరోయిన్… మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వారిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ట్రైలర్ కు అందాన్ని తీసుకువచ్చాయి. అలాగే తెలంగాణ యాసలో హీరో మాట్లాడుతూ.. ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ ను నింపాడు సిద్దు. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version