హీరో నాగార్జున ఎన్ని కోట్లకు అధిపతి తో తెలుసా..?

-

అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక నాగేశ్వరరావు కుమారుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన నాగార్జున కూడా మన్మధుడుగా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎలాంటి సినిమాలోనైనా ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నాగార్జున. ఇక ఇప్పుడు ఈయన కుమారులు కూడా నాగచైతన్య ,అఖిల్ కూడా ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే నాగార్జున సినీ ఇండస్ట్రీలో ఉండి ఇప్పటివరకు ఎంత సంపాదించారో అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీలో అక్కినేని స్టూడియోస్ నిర్వహణ నిర్వహిస్తూ అదే విధంగా వాటి మీద పలు సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక వీటితోపాటు పలు వ్యాపార ప్రకటనలు టీవీ షో ల ద్వారా కూడా నాగార్జున బాగా సంపాదిస్తూ ఉన్నారు. ఇక అంతే కాకుండా హైదరాబాద్ లో పలు పరిసరాల ప్రాంతాలలో కూడా కొన్ని ఖరీదైన భూములు ఉన్నట్లుగా సమాచారం. మొదట నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి హోస్టుగా వ్యవహరించారు. ఇక ఆ తరువాత బిగ్ బాస్ వంటి షో లకు హోస్టుగా చేస్తున్నారు. వరుసగా ఇప్పటికే మూడు సీజన్ల వరకు నాగార్జున చేశారు.అంతేకాకుండా తాజాగా తన కుమారుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక నాగార్జున ఇలా పలు టీవీ షో లలో, వ్యాపార సంస్థలలో సినిమాలలో హీరోగా, పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ప్రతినెల దాదాపుగా రూ.48 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక అంతే కాకుండా ఇటీవల వెలువడిన కొన్ని మీడియా కథనాల ప్రకారం నాగార్జున ఆస్తి విలువ దాదాపుగా రూ.1050 కోట్ల రూపాయలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఘోస్ట్ అనే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా అయినా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version