ఉదయ్ కిరణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

-

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నువ్వు నేను అనే చిత్రం ద్వారా తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన అనిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు తెలుగులో లవ్ సినిమాలలో ఎక్కువగా నటించి ప్రేక్షకుల మధిలో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ఈమె గతంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది. ఇకపోతే 2001 తేజా దర్శకత్వంలో వచ్చిన నువ్వు నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకున్న ఈమె ఆ తర్వాత నిన్నే ఇష్టపడ్డాను , శ్రీరామ్, నేను పెళ్ళికి రెడీ వంటి సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఏర్పడింది. ఒక మంచి హోదాలో ఉన్న సమయంలో ఆమె 2013లో ప్రముఖ వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని గోవాలో వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా తాను మంచి ఫిజిక్ తో బాగా వర్క్ అవుట్ లు చేస్తూ కష్టపడుతూ కనిపిస్తోంది. ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసే అనిత తాజాగా తన భర్తతో ఫన్నీ ఫన్నీ వీడియోలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇకపోతే ఈమె శరీరంలో ఎటువంటి మార్పు రాలేదు కానీ తాజాగా తాను పంచుకున్న వీడియోలో తనకి కొంచెం వయాసు అయినట్టుగా కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో షేర్ చేసుకోగా అందులో తన బాబుకి ఫుడ్ తినిపిస్తున్నట్లు కనిపించింది. ఇక బాబు ఆ ఫుడ్ తినడానికి చాలా టైం తీసుకోవడంతో ఆమె ఓపికతో తినిపిస్తూ కనిపించింది. ఇకపోతే అలా తినిపిస్తూ తినిపిస్తూ ముసల్ది అయినట్లు కనిపించింది అంటూ.. ప్రతి తల్లి బాధ ఇదే అంటూ పిల్లలు తినడానికి ఎంతో సమయం తీసుకుంటారు అంటూ సరదాగా ఆ వీడియోలో పంచుకుంది. మొత్తానికైతే ఈ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version