మెగాస్టార్ చిరంజీవి తొలి పారితోషకం ఎంతో తెలుసా..?

-

తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా ఈయనకు ఎంతలా అభిమానులు ఉన్నారు అంటే ఈయనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా.. కష్టపడి స్వయంకృషితో ఉన్నత స్థాయికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా మార్కెట్ విలువ కూడా ఈయనకు ఒక రేంజ్ లో ఉంటుంది. ఈయన డేట్స్ ఇస్తే చాలు అంటూ వేచి చూస్తున్న దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు.

ప్రస్తుతం ఒక్కొక్క సినిమాకు రూ.50 కోట్లు ఇవ్వడానికి కూడా చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇలాంటి ఇమేజ్ సొంతం చేసుకున్న చిరంజీవి ఇండియాలో తొలిసారి కోటి రూపాయలు పారితోషకము అందుకున్న హీరో కూడా కావడం విశేషం. అంతేకాదు బాలీవుడ్ హీరోలకు కూడా ఇది సాధ్యం కానీ అంశం అని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో ఆపద్బాంధవుడు సినిమా కోసం ఆయన ఏకంగా కోటి రూపాయల పారితోషకం తీసుకున్నారు. ప్రస్తుతం రూ. 50 కోట్ల పారితోషకం తీసుకుంటూ దూసుకుపోతున్న చిరంజీవి మొదటిసారి ఎంత సంపాదించాడు అనేది ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి తొలిసారి నటించిన పునాదిరాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలకు చిరంజీవికి ఎలాంటి పారితోషకం ఇవ్వలేదు. కానీ చిరంజీవి నటించిన మూడవ చిత్రం మన ఊరి పాండవులు సినిమాకు మాత్రం అప్పట్లో రూ.1,116 పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. కృష్ణంరాజు ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ లో నటించాడు. ఐదుగురు స్నేహితుల బ్యాచ్ లో చిరంజీవి కూడా ఉంటాడు. అలా తొలిసారి పారితోషకం అందుకున్న చిరంజీవి తెగ సంతోష పడిపోయారని సమాచారం. అందుకే పాత రోజులను ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా తన లైఫ్ స్టైల్ ని కూడా చాలా సింపుల్ గా కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version