రోజా బాలీవుడ్ లో కూడా నటించిందని తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో తన వైవిధ్యమైన నటనతో , అందంతో, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక హీరోయిన్గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత పలు చిత్రాలలో తల్లిగా కూడా నటించింది. కానీ బుల్లితెరపై జబర్దస్త్ షోలోకి వెళ్లిన తర్వాత తను మళ్ళీ ఏ చిత్రాలలో కూడా నటించలేదు. కేవలం ఆ షోకు జడ్జిగా ఉంటూ భారీగానే సంపాదించింది. ప్రస్తుతం రాజకీయాలలో కూడా తన హవా కొనసాగిస్తూ ఉంది రోజా. వైసీపీ పార్టీ తరపున ఏపీ పర్యటక మంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టింది.

హీరోయిన్ రోజా తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో నటించింది. మొదట ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత భైరవద్వీపం సినిమాతో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. తమిళంలో సినిమాలలో నటిస్తున్న సమయంలో దర్శకుడు నిర్మాత అయిన సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకుంది రోజా. ఆ తర్వాత తన దాంపత్య జీవితంలో బిజీగా ఉండడం వల్ల రోజా సినిమాలకు దూరమైంది. రోజా తెలుగు, తమిళంలోనే కాకుండా మలయాళం లో కూడా ఒక సినిమాలో, కన్నడలో రెండు చిత్రాలలో నటించినట్లు తెలుస్తోంది.

అయితే రోజా బాలీవుడ్ లో కూడా ఒక చిత్రంలో నటించిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఆమె మహేష్ భట్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి నటించిన జెంటిల్మెన్ అనే సినిమాలో రోజా ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఈ చిత్రం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మెన్ సినిమాకు రీమేక్. తెలుగులో చికుబుకు రైలే అనే పాటకు ప్రభుదేవా చేయగా హిందీలో చిరంజీవి చేశారట. సౌత్ లో ఈ సినిమా పాటకు గౌతమి ఐటెం సాంగ్ లో కనిపిస్తే బాలీవుడ్ లో మాత్రం రోజా కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version