చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి డాక్టార్ సమరం కూడా కారణం.. తెలుసా?

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వరుస సినిమాల షూటింగు‌ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో విజయదశమి కానుకగా ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ రిలీజ్ కానుంది. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలను వదిలేసి సినిమాల్లోనే ఉన్నారు. కాగా, చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి తాను కూడా ఓ కారణమని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంతకీ ఆయనకీ, చిరంజీవికి ఉన్న సంబంధం ఏమిటి.. చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి సమరం ఎలా కారణం.. అనే సంగతులు ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం పార్టీ’ స్థాపించక ముందు నుంచే తనకు ఆయనతో పదేళ్ల అనుబంధముందని డాక్టార్ సమరం చెప్పారు. ఆ సమయంలోనే ఓ సారి చిరంజీవి తనకు ఫోన్ చేసి గైడెన్స్ కావాలన్నాడని తెలిపాడు. అలా తాను చిరంజీవికి ఉన్న ప్రజా ఆకర్షణ, మంచి భావాలను చూసి రాజకీయాల్లోకి రావాలని ఎంకరేజ్ చేశానని డాక్టర్ సమరం గుర్తు చేసుకున్నారు.

కులరాజకీయాలను తీసుకురాడనే నమ్మకంతో తాను ప్రజారాజ్యం పార్టీ కోసం పని చేశానని చెప్పాడు. కాగా, ఆ పార్టీలోకి జంప్ జిలానీలు వచ్చినపుడు తాను చిరంజీవితో ఇది పద్ధతి కాదని చెప్పానని వివరించారు. మీ అభిమానులు మీకు బలం అని చిరంజీవికి చెప్పానని, కానీ, ఆయన వినలేదని, అలా చిరంజీవి రాజకీయాల్లో నెగ్గలేకపోయారని అన్నారు.

చిరంజీవి రాజకీయాల్లోకి రాకుంటేనే బాగుండేదని, ఆయన అంటే ఇప్పటికీ తనకు గౌరవం ఉందని డాక్టర్ సమరం చెప్పుకొచ్చారు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తు్న్న ‘గాడ్ ఫాదర్ ’పైన భారీ అంచనాలున్నాయి. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలు చేస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరంజీవి మూవీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version