ఎన్టీఆర్ , రామ్ చరణ్ లలో ఎవరి ఆస్తి ఎంతో తెలుసా.?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ కి, మెగా వారసుడి గా రామ్ చరణ్ కు ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వీరిద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్ సినిమా ద్వారా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఇద్దరికీ కూడా ఈ సినిమా ద్వారా మంచి ఇమేజ్ లభించడమే కాకుండా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరి ఆస్తి ఎంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆస్తులు, వారి రెమ్యూనరేషన్ ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గ్యారేజీలు ఎంతో ఖరీదైన కార్లు కూడా ఉండటం మనకు తెలిసిందే. ఇకపోతే ఎన్టీఆర్ గ్యారేజ్ లో లంబోర్గిని యూరిస్ గ్రాఫైట్ ఎంతో లగ్జరీ ఖరీదైన కారు. ఈ కారు ధర రూ. 3.16 కోట్లు. ఇక ఇవే కాకుండా మరికొన్ని కోట్ల విలువ చేసే కార్లు కూడా ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో ఎంతో ఖరీదైన విలాసవంతమైన బంగ్లాలు కొనుగోలు చేయడమే కాకుండా హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలలో కూడా ఖరీదైన ఇళ్లు ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కు మొత్తంగా రూ.450 కోట్లు ఉన్నట్లూ సమాచారం. పారితోషకం ఒక్కో సినిమాకు 45 కోట్ల రూపాయలు వరకు ఉంటుంది.రామ్ చరణ్ ఆస్తుల విషయానికి వస్తే ఆస్టన్ మార్టిన్ వన్ టేజ్ వంటి ఖరీదైన కారు ను రామ్ చరణ్ కి తన తండ్రి చిరంజీవి కానుక ఇచ్చారు. ఇక ఈ కారుతో పాటు మెర్సిడెస్ బెంజ్, gls350d ఇలాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి ధర 80 లక్షల రూపాయలు ఉండవచ్చని అంచన. ఇక రామ్ చరణ్ కి ట్రూజెట్ అని ఎయిర్ లైన్స్ సంస్థ కూడా ఉంది. రామ్ చరణ్ మొత్తం 1300 కోట్ల రూపాయలు. ఈయన పారితోషకం కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి రూ.45 కోట్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version