పోలీసులు నిర్లక్ష్యం ఓ ప్రాణం తీసింది. చలానా పేరుతో అరగంట కారును నిలపివేయడంతో మూడు నెలల బాబు మరణించాడు. ఈ విషాదకర సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. జనగాంకు చెందిన దంపతులకు మూడు నెలల కిందటే కుమారుడు జన్మించారు. అయితే బాబుకు అనారోగ్య కారణాల వల్ల జనగామ మండలం మరిగడి గ్రామం నుంచి యాదాద్రి మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. కార్ ను అద్దెకు తీసుకుని బాబుతో పాటు దంపతులిద్దరు హైదరాబాద్ పయణం అయ్యారు.
కాగా యాదగిరి గుట్ట వద్ద కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు కారుపై రూ. 1000 చలానా ఉందంటూ అరగంట పాటు ఆపేశారు. బాబుకు ఆరోగ్యం బాగా లేదన్న పోలీసులు కనికరించలేదు. చలానా కట్టి కారును తీసుకెళ్లాల్సిందే అని హుకుం జారీ చేశారు. దీంతో ఆసుపత్రికి అరగంట ఆలస్యంగా వెళ్లడంతో 3 నెలల బాబు మరణించాడు. పోలీసుల కారణంగానే తమ బాబు చనిపోయాడని దంపతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఓవరాక్షన్ కారణంగా తమ బాబను కోల్పోయామని బాబు తల్లిదండ్రులు విలపిస్తున్నారు.