‘కేజీఎఫ్’లో యశ్ అమ్మ పాత్ర పోషించిన అమ్మాయి వయసు ఎంతో తెలుసా?

-

ఎటువంటి అంచనాలకు లేకుండా విడుదలై దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ చిత్రం రెండో భాగం కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వచ్చే నెల 14న ఫిల్మ్ విడుదల కానుంది. ఈ సారి చాప్టర్ 2 చాప్టర్ వన్ ను మించి ఉంటుందని విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.పాన్ ఇండియా లెవల్ లో ఈ పిక్చర్ కు బోలెడంత క్రేజ్ ఉంది. ప్రశాంత్ నీల్ ఈ చిత్రంపైన చాలా కాన్సంట్రేట్ చేశాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

archana kgf mother

ఇకపోతే ఈ చిత్రం ద్వారా హీరో యశ్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో పాటు మంచి పేరు వచ్చింది. యశ్ తర్వాత అంతటి పేరు ఈ చిత్రంలో యశ్ చిన్న నాటి పాత్రకు తల్లిగా నటించిన అమ్మాయికి పేరు వచ్చింది. సినిమాను నడిపించే పాత్రగా ఆమె ఉండగా, అందులో ఆమె సహజంగా జీవించింది. యశ్ తల్లిగా ఆమె చేసిన ఎమోషనల్ యాక్టింగ్ కు ప్రేక్షకలోకం ఫిదా అయింది.

సినిమా ప్రధాన బలం ఆమె పాత్రనే కాగా, ఆమె చూపించిన నటనా ప్రతిభ.. తల్లి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయింది. యశ్ కు తల్లిగా నటించిన ఆమె పేరు అర్చన జైన్. ఈమె వయసు 26 ఏళ్లు మాత్రమే. మూడేళ్ల కిందట ఈమె మ్యారేజ్ జరిగింది.

సినీ కెరీర్ ప్రారంభంలో ఎవరైనా గ్లామరస్ రోల్స్ ప్లే చేయడానికి రెడీ అంటారు. కానీ, ఈమె మాత్రం తల్లి పాత్ర పోషించింది. అలా ఆమె బౌండరీలు దాటి మరి యాక్టింగ్ చేసి చక్కటి పేరు సంపాదించుకుంది. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లోనూ ఈమె కీలక పాత్ర పోషించినట్లు మేకర్స్ చెప్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version