వర్కౌట్స్ చేస్తూ.. జిమ్ లో సెగలు పుట్టిస్తున్న మిల్క్ బ్యూటీ..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ఆమె రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలకు పైగానే అవుతున్నా.. అదే పర్సనాలిటీ మైంటైన్ చేస్తూ అంతే క్రేజ్ తో దూసుకుపోతోంది.. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి భోలా శంకర్ సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. మెగాస్టార్ తో తమన్నా చేస్తున్న సినిమా ఇది రెండోది కావడం గమనార్హం.. ఇదిలా ఉండగా ఒకవైపు సౌత్ సినిమాలు చేస్తూనే.. మరొకవైపు హిందీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ఈమె అనుకున్నంత స్థాయిలో సినిమాలలో సక్సెస్ కావడం లేదు.. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ అందాల భామ ఫిట్నెస్ కోసం ఎక్కువగా జిమ్ లో గంటల తరబడి కష్టపడుతోంది. ఫర్ఫెక్ట్ లుక్ తో పాటు గ్లామర్ ని కూడా మెయింటైన్ చేయడానికి జిమ్ లో చెమటలు చిందిస్తున్నారు. తమన్నా ఇప్పుడు తన పాలు గారే అందాలను చూపిస్తూ జిమ్లో వర్కౌట్స్ తో చెమటలు చిందిస్తున్న దేహ సౌందర్యాన్ని చూపిస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.

ఆమె ఒక చేత్తో డంబుల్స్ ని చాలా ఈజీగా ఎత్తేస్తున్నట్లు మనం చూడవచ్చు.. అసలే పాలు గారే అందం.. పైగా టైట్ ఫిట్ డ్రెస్ లో తమన్నా అందాలు చూడడానికి నెటిజెన్లు కూడా సోషల్ మీడియాలో క్యూ కట్టేశారు. అంతేకాదు ఈ రేంజ్ లో ఈమె గ్లామర్ వలకబోస్తూ వర్కౌట్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news