మీటూపై రజిని స్పందన ఇదే

-

బాలీవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్న మీటూ క్యాంపెయిన్ ప్రస్తుతం కోలీవుడ్ లో హంగమా సృష్టిస్తుంది. సింగర్ చిన్మయి వైరముత్తు మీద చేసిన వ్యాఖ్యలతో మిగతా వారు కూడా తమ కెరియర్ లో జరిగిన విషయాల గురించి ప్రస్థావిస్తున్నారు. మీటూపై సూపర్ స్టార్ రజిని స్పందన ఏంటి అంటే.. వేధింపులు ఎదుర్కుంటున్న ఆడవారికి ఇదో మంచి అవకాశం అని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా అలాంటి వారికి మేలు జరుగుతుందని అన్నారు.

అయితే ఈ ఉద్యమం దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరచుకోవాలని కూడా అన్నారు రజినికాంత్. కొందరు చేసే పనుల వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్న మహిళలు నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇక వీటితో పాటుగా వైరముత్తుపై వచ్చిన అభియోగాలను ప్రస్థావిస్తూ మాట్లాడారు రజినికాంత్.

వైరముత్తు తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు తోసిపుచ్చారని.. కోర్ట్ ద్వారా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అవసరమైన ఆధారాలను కూడా ఇస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. వైరముత్తు నిర్ధోశిత్వం నిరూపించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version